![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద అనసూయ గురించి అందరికీ తెలుసు. ఫైర్ బ్రాండ్ అని. ఐతే ఆమె భర్త భరద్వాజ్ గురించి ఎవరికీ తెలీదు. కానీ నెక్స్ట్ వీక్ వచ్చే ఫామిలీ స్టార్స్ షోలో ఆ విషయం తెలియబోతోంది. ఆయనొక సెటైరికల్ కామెడీ పర్సన్ అని. శ్రీరామనవమి సందర్భంగా ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అనసూయ గోల్డెన్ కలర్ చీరలో తన భర్త భరద్వాజ్ తో కలిసి వచ్చింది. అలాగే ఈ షోకి ఆట సందీప్ - జ్యోతిరాజ్, శ్రీవాణి - విక్రమాదిత్య, లాస్య - మంజునాథ్, జ్యోతక్క - గంగూలీ, సిద్దార్ధ్ వర్మ - విష్ణు జోడీస్ వచ్చారు. ఇక ఇందులో వీళ్ళు అడిగిన ప్రశ్నలకు అనసూయ భరద్వాజ్ బాగా ఆన్సర్స్ ఇచ్చారు. "ఎందుకు కుకింగ్ అంటే ఆడాళ్లే చేయాలి" అని జ్యోతక్క అడిగింది. దానికి అనసూయ " ఖైదీలకు ఫుడ్ పెట్టే బాధ్యత జైలర్ దే కదా.
నా భర్త నా ప్రేమ ఖైదీ కాబట్టి అలా చెప్పాను" అంది. "ఎప్పుడూ భార్య భర్తకు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎందుకు ఉంటుంది" అని విక్రమాదిత్య అడిగాడు..దానికి భరద్వాజ్ "ఎందుకంటే వాళ్ళు వాళ్లెప్పుడూ రైట్ వేలో ఆలోచించారు కదా" అని సెటైర్ వేసేసరికి అనసూయ ముఖం మాడిపోయింది. "సరే ఈరోజు పిల్లలతో పడుకో" అంటూ పాపం భరద్వాజ్ కి గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. "ఏంటండీ ఇది.. ఇదేం పనిష్మెంట్ ..పాపం ఆయన జస్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. ఎందుకు ఆయన్ని ఇలా చేస్తారు" అంటూ సుడిగాలి సుధీర్ భరద్వాజ్ గురించి మాట్లాడాడు. తర్వాత "పెళ్లయ్యాక అబ్బాయిలకు మాత్రమే పొట్టోస్తుంది కదా ఎందుకు" అని అడిగాడు ఆట సందీప్. " అన్ని కష్టాలు మనమే తీసుకుంటాం కదా అది పొట్టలో ఉండిపోయి పొట్ట పెరిగిపోతుంది" అంటూ భరద్వాజ్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో అనసూయ కన్నీళ్లు పెట్టుకుని "అమ్మో ఈ షోకి వచ్చాక మా ఆయన ఎంత మారిపోయాడో" అంటూ సరదాగా కామెడీ చేసింది.
![]() |
![]() |